జనగణమన దినపత్రిక

నెక్కంటి జంగిల్ రైడ్‌కు తాత్కాలిక విరామం

- కనువిందు చేసిన అడవి రాజు

3

నల్లమల, జూన్ 30: వన్యప్రాణుల సంరక్షణ, పులుల సంతానోత్పత్తి కాలం మరియు వర్షాకాల భద్రత దృష్ట్యా నెక్కంటి జంగిల్ రైడ్ ను జూలై నుంచి సెప్టెంబర్ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ మూడు నెలల పాటు పులుల సంతానోత్పత్తి కాలం కొనసాగుతుండటంతో పాటు, వర్షాల కారణంగా అడవిలో ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అక్టోబర్ నెల నుంచి వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత జంగిల్ రైడ్‌ను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. అడవి, వన్యప్రాణుల పరిరక్షణకు సహకరించాలని, పర్యాటకులు ఈ తాత్కాలిక మూసివేతను అర్థం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

ఫోటో & వీడియో: మణిక్ లాల్ దత్తా – హైదరాబాద్‌లోని సెరిలింగంపల్లి నివాసి. ప్రముఖ కంపెనీలో మాజీ సీనియర్ డైరెక్టర్‌గా సేవలందించారు. ప్రస్తుతం ఉద్యోగ జీవితానికి విరామం ఇచ్చి, తన అభిరుచి అయిన వన్యప్రాణుల పర్యటనలు (Wildlife Tours) మరియు వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీపై పూర్తిగా దృష్టి సారిస్తున్నారు. ఈ అనుభవాలను “Discoveryourself_travel” అనే ఛానల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఫోటో &  వీడియో “జనగణమన దినపత్రిక” కు ప్రత్యేకం

Leave A Reply

Your email address will not be published.