సెంట్రల్లో డెస్క్ : ఏపీలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు ఉక్కపోత కూడా అధికంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండగా, మరో 88 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే సూచనలు ఉన్నాయి. అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.