జనగణమన బ్యూరో – హైదరాబాద్: రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డిని పలువురు మహిళా ప్రముఖులు కలిసి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ముఖ్యమంత్రికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, కమిషన్ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి రాఖీ కట్టారు. మలక్‌పేట్‌లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు కూడా ముఖ్యమంత్రిని కలిసి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారిని ఆప్యాయంగా పలకరించి ఆశీర్వదించారు.
రాఖీ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.