జనగణమన దినపత్రిక

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

- చంద్లాపూర్ గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూజల హరికృష్ణ

2

జనగణమన ప్రతినిధి – సిద్దిపేట: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. చిన్నకోడూరు మండలం చందలపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత గూడు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని, ఒక కుటుంబానికి భరోసా, ఆత్మగౌరవం, భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తారని తెలిపారు.

చందలపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల్లో గృహప్రవేశ వేడుకల సందర్భంగా ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా పూజల హరికృష్ణ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నూతన గృహాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం, అభివృద్ధి నిండాలని ఆకాంక్షించారు. “పేదల కన్నీళ్లు తుడిచే ప్రభుత్వం.. ప్రతి పేద కుటుంబానికి సొంతింటి భరోసా ఇచ్చే ప్రభుత్వం.. అదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం” అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ బుస్స రాజశేఖర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మీ, దాస అంజయ్య, బొమ్మల యాదగిరి, కలీం ఉద్దీన్, ఎర్ర మహేందర్, నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షుడు శ్రీకాంత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు లహరి, ఏఎంసీ డైరెక్టర్లు విజయ్ కుమార్, రాజవర్ధన్ రెడ్డి, తాళ్లపల్లి రాజు, వినోద్, మహిపాల్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ కనుకయ్య, సర్పంచులు ఎర్ర భవాని, నవీన్, నాగరాణి ఎల్లం, ఉపసర్పంచ్ ఐలయ్యతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరంజీవి, కరుణాకర్, బాలరాజు, బోయ ఎల్లం, సూరగోని ప్రభాకర్, పాపమ్మ, దుబ్బ శ్రీను, కొమ్ముగాళ్ల వెంకట్, భూపతి, దరిపల్లి శ్రీను, బుడ్డా రాజు, బాలయ్య, సంపత్, శ్రీనివాస్, రామకృష్ణ, సిద్దు, ప్రసాద్ దుర్గచారి, సంతోష్, వినయ్, నాగరాజు, రాజనర్సు, గ్రామస్థులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.