కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి విమర్శ

 

సెంట్రల్ డెస్క్ : కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలు చేశారు. ఈ అంశం పై రాజ్య సభలో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంతో.. రూ.లక్ష కోట్ల ప్రజాధనం వృథా చేసినట్లు విమర్శలు చేసిన ఆయన ప్లానింగ్‌, డిజైన్‌ లోపాల కారణంగానే కాళేశ్వరం వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర బృందం అధ్యయనం జరుగుతోందని తెలిపారు. రాజ్యసభలో ఎంపీ సురేష్ రెడ్డి కోరిక పై స్పందించిన కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌… మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగిపోవడానికి గల కారణాలపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను కేంద్ర బృందం అధ్యయనం చేస్తోందని వివరించారు. జల్ జీవన్ మిషన్ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ వద్ద రూ.873 కోట్ల నిధులు ఉన్నాయని.. కేవలం రూ.194 కోట్లే ఖర్చు చేశారని ఆయన వివరించారు. గత 3 ఏళ్లుగా ఒక్క ప్రతిపాదన కూడా కొత్తగా తెలంగాణ రాష్ట్రం నుంచి రాలేదని అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించి పూర్తి వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.