భారత చరిత్రలో రెడ్ లెటర్ డే

- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ / న్యూ ఢిల్లీ: లోక్‌సభలో జరిగిన తాజా రాజకీయ పరిణామాలపై తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్) ద్వారా స్పందించారు. ముఖ్యంగా డీలిమిటేషన్‌కు సంబంధించి వచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లులపై లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలనఆయన కీలకంగా వ్యాఖ్యానించారు.

“ఇది భారత చరిత్రలో రెడ్ లెటర్ డే : లోక్‌సభలో డీలిమిటేషన్‌కు అనుసంధానించిన బిల్లులు ఓటమి పాలవడం చారిత్రాత్మకమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని “భారత చరిత్రలో గుర్తుంచుకునే రోజు”గా అభివర్ణించారు. ఈ విజయానికి ప్రతిపక్ష ఐక్యత కారణమని ఆయన తెలిపారు. ముఖ్యంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులు ఒక్కటయ్యాయని పేర్కొన్నారు.

డీలిమిటేషన్‌పై కేంద్రంపై విమర్శలు: సీఎం రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ విధానంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జనాభా ఆధారంగా మాత్రమే లోక్‌సభ స్థానాలు పెంచడం దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేస్తుందని ఆయన అభిప్రాయం. ఇది రాజకీయ శక్తి సమతౌల్యాన్ని భంగం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు . ఇక లోక్‌సభలో కూడా ఇదే అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ప్రతిపక్షం ఈ చర్యలు సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆరోపించింది.

మహిళా రిజర్వేషన్ & డీలిమిటేషన్ సంబంధం: సీఎం అభిప్రాయం ప్రకారం మహిళా రిజర్వేషన్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తున్నప్పటికీ, దాన్ని డీలిమిటేషన్‌తో అనుసంధానం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ అవసరమని ఆయన సూచించారు.

రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సూచనలు: లోక్‌సభలో జరిగిన చర్చలు, వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. కొందరు ఎంపీల వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తుండగా, దక్షిణ రాష్ట్రాల హక్కులపై చర్చ మరింత ఉధృతమవుతోంది.

లోక్‌సభలో జరిగిన తాజా పరిణామాలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, ప్రాంతీయ సమతౌల్యం వంటి అంశాలపై కేంద్ర-ప్రతిపక్షాల మధ్య విభేదాలు మరింత స్పష్టమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చకు దారితీసే అవకాశముంది.

Leave A Reply

Your email address will not be published.