జనగణమన దినపత్రిక

బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్‌: మైనర్ బాలికపై వేధింపుల ఆరోపణల కేసులో అరెస్టైన బండి భగీరథ్ కు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. వైద్య పరీక్షల అనంతరం పోలీసులు భగీరథ్‌ను కోర్టులో హాజరుపరచగా, ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఈ కేసుకు సంబంధించిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా భగీరథ్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కేసులో మరిన్ని వివరాలను సేకరించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా, భగీరథ్‌పై నమోదైన కేసు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు, తమ కుమారుడు ఎలాంటి తప్పూ చేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చట్టపరంగా పోరాడతామని, న్యాయస్థానంపై పూర్తి విశ్వాసం ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.