ఈనెల 11 నుండి విద్యా వారోత్సవాలు

- ఎల్ బి స్టేడియం లో ప్రారంభోత్సవ కార్యక్రమం

హైదరాబాద్ : రాష్ట్రంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 వ తేదీ నుండి నిర్వహించేంచే విద్యా శాఖ వారోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా వారోత్సవాల నిర్వహణపై కలెక్టర్లతో నేడు వీడియొ కాన్ఫరెన్స్ నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్లతో మాట్లాడుతూ ఈ నెల 11 న ఎల్ బి స్టేడియం లో నిర్వహించనున్న విద్యావారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా కలెక్టర్లు చొరవతీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టే వారోత్సవాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను , రోజువారీ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్లకు విద్యాశాఖ ఉన్నతాధికారులు వివరించారు. అంతకుముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ కి సంబంధించిన పురోగతి, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లు, జనాభా స్వీయ గణన కు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సి ఎస్ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ వీడియొ కాన్ఫరెన్స్ లో విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రానా , కళాశాల విద్యా శాఖ కమీషనర్ దేవసేన, పాఠశాల విద్య శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ , పౌర సరఫరాల శాఖ కమీషనర్ స్టీఫెన్ రవీంద్రతదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.