జనగణమన దినపత్రిక

శ్రీచరణ కమ్యూనికేషన్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

2

జనగణమన ప్రతినిధి – హైదరాబాద్: శ్రీచరణ కమ్యూనికేషన్ కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ యజమాని, మేనేజింగ్ డైరెక్టర్ బుస్సా శ్రీనివాస్ గుప్తాతో పాటు శ్రీచరణ కమ్యూనికేషన్ బృంద సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, “స్వాతంత్ర్యం గతం మనకు అందించిన కానుక మాత్రమే కాదు… భవిష్యత్తు కోసం మనపై ఉన్న గొప్ప బాధ్యత” అని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి, ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

దేశ సమగ్ర అభివృద్ధిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, సేవాభావంతో ముందుకు సాగుతూ దేశ ప్రగతికి తోడ్పడాలని సూచించారు.

కార్యక్రమంలో శ్రీచరణ కమ్యూనికేషన్ సిబ్బంది దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను పరస్పరం తెలియజేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.