సెంట్రల్ డెస్క్: ఢిల్లీ, యూపీ, హర్యానా, రాజస్థాన్‌లో ఆకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ఢిల్లీలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో వర్షంతో పాట ఉరుములు, మెరుపులతో కూడిన భారీ గాలులతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. ఢిల్లీలో గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వేస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. అల్పపీడనం కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలురానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.