హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విచారణలో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉన్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులపై ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు స్పష్టం చేసింది. కమిషన్ విచారణ జరిపేటప్పుడు సహజ న్యాయ సూత్రాలను పాటించాలి. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ విచారణలో కనీస నిబంధనలు పాటించలేదని హైకోర్టు అభిప్రాయపడింది. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తుల వాదనలను పరిగణనలోకి తీసుకోవడంలో లేదా నోటీసుల జారీలో చట్టబద్ధమైన ప్రోటోకాల్‌ను అనుసరించలేదని కోర్టు గుర్తించింది. లోపాల కారణంగానే, సదరు కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రాతిపదికగా చేసుకుని ఎలాంటి కఠిన చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా? లేదా హైకోర్టు సూచనల మేరకు విచారణ ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి చట్టబద్ధంగా ప్రారంభిస్తుందా? వేచిచూడాలి.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.