తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ ప్రారంభం

న్యూ ఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలకమైన రెండు రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

తమిళనాడులో పోలింగ్ : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 234 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.73 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు 75,064 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా ఎటువంటి లోపాలు లేకుండా ఉండేందుకు 85,875 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది.

పశ్చిమ బెంగాల్‌లో తొలివిడత పోలింగ్:  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్ ఈరోజు జరుగుతోంది. 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ కొనసాగనుంది. ఈ దశలో మొత్తం 1,478 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా భద్రతా బలగాలను పంపింది. సుమారు 2.5 లక్షల మంది కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. రాష్ట్రంలో 8 వేలకుపైగా అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక భద్రత కల్పించారు. ప్రతి కేంద్రంలో కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.