ప్రధాని సభకు 2 వేల మందితో భద్రత : సీపీ సుమతి

హైదరాబాద్ : రేపు ప్రధాని సభకు లక్ష మందికిపైగా హాజరవుతారని అంచనా వేస్తున్నామని సీపీఐ సుమతి తెలిపారు. సభ పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులు వాడుకపై నిషేధం విధించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని, పరేడ్‌ గ్రౌండ్‌ వైపు వెళ్లే వాహనదారులు.. ప్రత్యమ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 వరకు.. భారీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయని,  సభ కోసం 12 పార్కింగ్‌లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పార్కింగ్‌ ప్రదేశాల దగ్గర QR కోడ్‌ ఉంటుందని, రోడ్లపై వాహనాలు పార్క్‌ చేస్తే సీజ్‌ చేస్తామని సుమతి తెలిపారు. జిల్లాల నుంచి 3,200 బస్సులు వస్తాయని,  ఉప్పల్‌, నిజాం కాలేజ్, సంజీవయ్య పార్క్ దగ్గర..బస్సులు పార్క్ చేసి మెట్రోలో సభకు రావాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.