చెన్నై: తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. రేపు ఉదయం గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నై సిటీలోని నెహ్రూ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు చేస్తున్నారు. 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న సంతకాలతో గవర్నర్ ను కలిసి తమను ఆహ్వానించాలని కోరారు.
ఈ క్రమంలో గవర్నర్ అర్లేకర్ నుంచి వచ్చిన గ్రీన్ సిగ్నల్ వచ్చింది . రేపు ముఖ్యమంత్రి గా విజయ్ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అయితే తనతోపాటు కొంత మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.