ఇస్లామాబాద్: ఇరాన్–అమెరికా చర్చల తొలి దఫా ఎటువంటి స్పష్టమైన ఒప్పందం లేకుండా ముగిసింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బృందంతో భేటీ అయ్యింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన చర్చల్లో ఇరు దేశాలు తమ తమ ప్రతిపాదనలపై నోట్స్ మార్పిడి చేసుకున్నప్పటికీ, కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. షరతుల విషయంలో ఇరువైపులూ పట్టువీడలేదు. సమావేశం ఐదు గంటలు ఆలస్యంగా జరగడం గమనార్హం. సమావేశానికి ముందు పాకిస్తాన్ ప్రధాని వేర్వేరుగా ఇరు బృందాలతో చర్చలు జరిపారు. ఇదే సమయంలో చర్చలు విఫలమైతే పరిస్థితి తీవ్రంగా మారవచ్చని మాజీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. మలివిడతో చర్చలు జరిగే అవకాశం ఉంది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.