జనగణమన దినపత్రిక

సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ

- జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడిని ఖండిస్తూ...

2

హైదరాబాద్, జూలై 25: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు.

నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరుకానున్నారు.

విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేయడమే ఈ కొవ్వొత్తుల ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.