జనగణమన దినపత్రిక

పద్మశ్రీ భారతీరాజా మృతికి సీఎం సంతాపం

1

హైదరాబాద్, జూన్ 10: నటుడు, దర్శకుడు పద్మశ్రీ భారతీరాజా గారి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన భారతీరాజా దర్శకుడిగా, నటుడిగా విశేష ఖ్యాతి గడించారని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన, సందేశాత్మక చిత్రాలను వివిధ భాషల్లో తెరకెక్కించి భారతీయ చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలందించారని పేర్కొన్నారు. భారతీరాజా మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.