ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ సమస్యలకు యుద్ధం ఒక్కటే పరిష్కారం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. చట్ట పరిపాలన, పరస్పర చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారానే వివాదాలకు శాంతియుత పరిష్కారం సాధ్యమని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, ఫిన్లాండ్ దేశాలు రెండూ కూడా చట్ట పరిపాలన, చర్చలు, దౌత్యానికి ప్రాధాన్యం ఇస్తాయని మోదీ తెలిపారు. యుద్ధం ద్వారా సమస్యలు పరిష్కరించలేమని ఇరు దేశాలు భావిస్తున్నాయని చెప్పారు. ఉక్రెయిన్ నుంచి పశ్చిమాసియా వరకు కొనసాగుతున్న ఘర్షణలకు త్వరితగతిన ముగింపు పలకాలని, శాంతి దిశగా జరిగే ప్రతి ప్రయత్నానికీ భారత్ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు, సంస్కరణలు అత్యవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో నిర్మూలించాలన్న లక్ష్యంలో భారత్, ఫిన్లాండ్ దేశాలు ఒకే అభిప్రాయంతో ఉన్నాయని వెల్లడించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.