హైదరాబాద్: కేరళలో రేవంత్ రెడ్డి మోసపూరిత మాటలు నమ్మొద్దని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కేరళలో లెఫ్ట్ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరుతూ వీడియో ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల ద్వారా తెలంగాణ ప్రజలను మోసం చేశారని అటువంటి కాంగ్రెస్ పార్టీని కేరళ ప్రజలు నమ్మవద్దని సూచన చేశారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో వృద్ధులకు, యువతకు, మహిళలకు, నిరుద్యోగులకు అనేక రకాల హామీలు ఇచ్చి మహిళలకు ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీని అమలు చేయలేదని తద్వారా తెలంగాణ ప్రజలను మోసం చేశారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రం నిధులు సమకూర్చే ప్రభుత్వంలా మారిందని తెలిపారు. కేరళ ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను నమ్మకూడదని కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. కేరళ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కోరుకునేవారు వామపక్షాల అభ్యర్థులకు మద్దతు తెలిపి విజయన్ ను ముఖ్యమంత్రి గా మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.