కాబూల్‌లో ఆస్పత్రిపై దాడి లో 400 మంది మృతి

- పాక్ దుశ్చర్య

సోమవారం రాత్రి పాకిస్తాన్ వైమానిక దళం కాబూల్‌లోని ఒక ఆసుపత్రిపై జరిపిన దాడిలో సుమారు 400 మంది మరణించినట్లు తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇస్లామిక్ ఎమిరేట్ వివరాల ప్రకారం.. కాబూల్‌లోని డ్రగ్స్ రిహబిలిటేషన్ సెంటర్‌ లక్ష్యంగా పాకిస్తాన్ సైన్యం బాంబు దాడి చేయడంతో 400 మంది పౌరులు మరణించగా.. మరో 250 మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. బాంబు ధాటికి ఆసుపత్రి భవనం పూర్తిగా ధ్వంసం కాగా శిథిలాల కింద మృతదేహాలు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.