హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీసీ సమ్మెపై విజ్ఞప్తి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తామని తెలిపింది. రేపు ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చర్చలకు రావాలని ఆహ్వానించింది. కాళేశ్వరం అంశం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును పరిశీలించింది. సీబీఐ దర్యాప్తును వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై న్యాయ నిపుణులతో చర్చించనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలు ఉద్యోగులు, రిటైర్డ్ సిబ్బందికి వేల కోట్లు బకాయిలు ఉన్నాయని కేబినెట్ తెలిపింది. వీటిని త్వరగా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయం చేసింది. అవసరమైతే మంత్రులు తమ జీతాల్లో 50% ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించారు. PACS కమిటీలు పదవీకాలం ముగిసిన సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకవర్గాలను నియమించేందుకు ఆమోదం తెలిపింది. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి PPP విధానంలో స్టేడియం అభివృద్ధి చేయడంతో పాటు దాని సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకి పెంపుదల చేయాలని నిర్ణయించింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి క్రీడాకారులకు సదుపాయాలు కల్పించాలని క్యాబినెట్చి నిర్ణయం తీసుకున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు మంథని ప్రాంతంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తి చేయాలని, మిగిలిన భూమి కోసం రూ.166.67 కోట్లు ఆమోదం తెలిపింది. ఆక్వా పార్క్ మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో 85 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు చేయాలని ఆమోదం తెలిపింది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.