ముఖ్యమంత్రిని కలిసిన సమాచార కమిషన్ చైర్మన్, సభ్యులు

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లో ఆయన నివాసంలో రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌ చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సమాచార కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాస్, దేశాల భూపాల్ కూడా పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో నిర్వహించిన ఆర్టీఐ కార్యకలాపాలు, ప్రజలకు సమాచార హక్కు చట్టం ద్వారా అందుతున్న సేవలు, పెండింగ్ దరఖాస్తుల పరిష్కార చర్యలు తదితర అంశాలను ముఖ్యమంత్రికి వివరించినట్లు కమిషనర్లు తెలిపారు. రాష్ట్రంలో పారదర్శక పాలనకు ఆర్టీఐ వ్యవస్థ కీలకమని పేర్కొన్న ముఖ్యమంత్రి, ప్రజలకు సమయానికి సమాచారం అందేలా చర్యలు కొనసాగించాలని సూచించినట్లు సమాచారం. అలాగే ప్రజల సమస్యల పరిష్కారంలో సమాచార కమిషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.