హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కేరళకు బయలుదేరనున్నారు. రేపు తిరువనంతపురంలో జరగనున్న కేరళ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వి డి సతీషన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా హాజరుకానున్నారు. తిరువనంతపురంలో జరిగే ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.