షాబాద్ (రంగారెడ్డి జిల్లా), జూలై 10: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో శనివారం అర్ధరాత్రి జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోక్సో కేసు లో నిందితుడు రాజ్‌కుమార్ అనే వ్యక్తి దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం. కేసు ఉపసంహరించుకోవాలని కోరగా విముఖత చూపించడంతో వారిపై కక్ష్య పెంచుకొని ఈ ఘాతుకానికి దిగినట్టు తెలుస్తుంది.
మృతుల్లో నిందితుడి భార్య, ఇద్దరు పిల్లలతో పాటు బాధిత బాలిక, ఆమె తల్లి, నానమ్మ ఉన్నట్లు తెలిసింది. ఘటన అనంతరం నిందితుడు పరారీలో ఉండగా, అతడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్ని, ఉద్రిక్తతను కలిగించింది.