హైదరాబాద్, జూన్ 28: దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్లో ప్రతిభ కనబరుస్తున్న యువ క్రీడాకారిణులకు జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ (EWCL) అధికారిక లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జూబ్లీ హిల్స్‌లోని ఎంఎంసీసీసీ (MMCCC)లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా లీగ్‌లో పాల్గొననున్న 16 జట్లను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి శ్రీచరణ మీడియా మేనేజింగ్ డైరెక్టర్లు బుస్సా శ్రీనివాస్ గుప్తా మరియు బుస్సా మాధవి గుప్తా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఈడబ్ల్యూసీఎల్ అధికారిక ఏజెన్సీ భాగస్వామిగా వ్యవహరిస్తున్న శ్రీచరణ మీడియా పాత్రను వివరించారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి తోడ్పడే ఈ ప్రతిష్ఠాత్మక లీగ్‌తో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వారు, 2026 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానున్న ఈడబ్ల్యూసీఎల్ దేశవ్యాప్తంగా ఉన్న యువ మహిళా క్రికెటర్లకు తమ ప్రతిభను నిరూపించుకునే అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు ప్రతిభ కలిగిన మహిళా క్రీడాకారిణులను వెలికితీసి, వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో ఈ లీగ్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. మహిళా క్రికెట్‌కు కొత్త దిశను నిర్దేశించే ఈ వినూత్న కార్యక్రమం భవిష్యత్తులో మరెంతో మంది యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తుందని, భారత మహిళా క్రికెట్ అభివృద్ధికి ఇది బలమైన పునాదిగా మారుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈడబ్ల్యూసీఎల్ నిర్వహణ బృందానికి, లీగ్ విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వాహకులు, భాగస్వామ్య సంస్థలు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికీ బుస్సా శ్రీనివాస్ గుప్తా మరియు బుస్సా మాధవి గుప్తా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో లీగ్ నిర్వాహకులు, క్రికెట్ రంగానికి చెందిన ప్రముఖులు, స్పాన్సర్లు, క్రీడాభిమానులు, వివిధ జట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. లోగో ఆవిష్కరణతో పాటు 16 జట్ల పరిచయం కార్యక్రమం ఆకట్టుకోగా, ఈడబ్ల్యూసీఎల్ మహిళా క్రికెట్లో నూతన శకానికి నాంది పలికే లీగ్‌గా అవతరిస్తుందనే ఆశాభావం వ్యక్తమైంది.