జనగణమన దినపత్రిక

సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేత

- కాసార్ల రజితకు రూ.60 వేల ఆర్థిక సాయం

2

జనగణమన ప్రతినిధి – సిద్దిపేట: సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్లా పూర్ గ్రామానికి చెందిన కాసార్ల రజిత, భర్త వెంకట్ రెడ్డి గారికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.60,000 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కును కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ పూజల హరికృష్ణ చేతుల మీదుగా అందజేశారు. అనారోగ్యంతో వైద్య చికిత్స పొందుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ సాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.

చెక్కు అందుకున్న కాసార్ల రజిత కుటుంబ సభ్యులు ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. వైద్య చికిత్సకు ఈ మొత్తాన్ని వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.