జనగణమన దినపత్రిక

సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగం

- x లో ఎమోషనల్ పోస్టు

1

లక్షల అక్షరాలతో రాసినా… కోట్ల పదాలను కూర్చి చెప్పినా… తరగని మధుర జ్ఞాపకం…

ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.

నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై… నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.

ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.

ఇదే స్ఫూర్తితో, ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో, మీ అందరి ఆశీర్వాద బలంతో… భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా… అన్నింటికీ మించి రేవంతన్నగా…

మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.

https://x.com/revanth_anumula/status/2073239840364326992?s=48

Leave A Reply

Your email address will not be published.