ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన

కొడంగల్: పేదల తిరుపతిగా పేరు పొందిన కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీమహాలక్ష్మీ వెంకటేశ్వరస్వామి (కొడంగల్ బాలాజీ) ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేదపండితుల సమక్షంలో నిర్వహించిన భూమి పూజ, యాగంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణంతో పాటు కొడంగల్ లో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.