జనగణమన – కుత్బుల్లాపూర్: కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌లో చెన్నై షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 4వ బిగెస్ట్ సేల్ ఎగ్జిబిషన్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీనటి హెబ్బా పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల విలువైన వస్త్రాలను ప్రత్యేక డిస్కౌంట్ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకు నాణ్యమైన దుస్తులను విక్రయించడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
చెన్నై షాపింగ్ మాల్ డైరెక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ.. నగరంలో నిర్వహిస్తున్న తమ సంస్థకు ఇది 4వ ఎగ్జిబిషన్ అని తెలిపారు. షోరూమ్‌లకు వెళ్లి షాపింగ్ చేయడానికి సమయం, ప్రయాణం వంటి ఇబ్బందులు ఎదుర్కొనే వినియోగదారులకు వారు నివసించే ప్రాంతానికి సమీపంలోనే నాణ్యమైన వస్త్రాలను అందించాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్లు వివరించారు.
సెప్టెంబర్ 3 నుంచి 10 రోజుల పాటు కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌లో ఈ బిగెస్ట్ సేల్ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని కృష్ణారావు తెలిపారు. మహిళలు, పురుషులు, చిన్నారులకు సంబంధించిన వివిధ రకాల వస్త్రాలు, విలువైన దుస్తులను ప్రత్యేక రాయితీ ధరలకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. అలాగే త్వరలో ఆర్‌సీ పురంలో మరో చెన్నై షాపింగ్ మాల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. వినియోగదారులకు మరింత చేరువగా వెళ్లి నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించడమే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.
కొంపల్లి, పరిసర ప్రాంతాల ప్రజలు ఈ 10 రోజుల ఎగ్జిబిషన్‌ను సందర్శించి తమకు నచ్చిన వస్త్రాలను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.