8వ నెలలో 1.4 కేజీల బరువుతో పుట్టిన శిశువుకు పునర్జన్మ
- పద్మావతి హాస్పిటల్ వైద్యుల కృషిని కొనియాడిన తల్లిదండ్రులు
వేములవాడ: నెలలు నిండకుండానే, అతి తక్కువ బరువుతో జన్మించిన ఓ మగబిడ్డను వేములవాడలోని పద్మావతి తల్లి మరియు పిల్లల హాస్పిటల్ వైద్యులు అత్యుత్తమ వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. 14 రోజుల నిరంతర చికిత్స అనంతరం తల్లి, బిడ్డను సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారు.
కేసు వివరాల్లోకి వెళ్తే : నల్గొండకు చెందిన లింగంపల్లి పుష్పలత, భర్త భరత్ దంపతులకు గర్భ ధారణ నుండి చికిత్స పొందుతున్నారు. పుష్పలత గర్భిణిగా ఎనిమిది నెలలు నిండకముందే తీవ్ర పురిటి నొప్పులతో పద్మావతి హాస్పిటల్లో చేరారు. గైనకాలజిస్ట్ డాక్టర్ తేజస్విని పరీక్షించి, పురిటి నొప్పులు తగ్గించడానికి మరియు గర్భస్థ శిశువు ఊపిరితిత్తులు మెరుగుపడటానికి అవసరమైన మందులు ఇచ్చి డెలివరీని ఆలస్యం చేయడానికి ప్రయత్నించారు. కానీ పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పుష్పలతకు నార్మల్ డెలివరీ చేయగా, 1.4 కేజీల బరువుతో మగబిడ్డ జన్మించాడు. అయితే శిశువు ఆరోగ్యం క్లిష్టంగా ఉండటంతో చిన్న పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శివకుమార్ పర్యవేక్షణలో NICU లో అత్యుత్తమ వైద్యం అందించారు. బాబుకు నాలుగు రోజుల పాటు నాన్-ఇన్వేసివ్ వెంటిలేషన్ ద్వారా శ్వాస అందించారు. పూర్తి నెలలు నిండని పిల్లల్లో వచ్చే ఆర్.డి.ఎస్ (RDS), సెప్సిస్, ఆప్నియా ఆఫ్ ప్రీమెచ్యూరిటీ ,ఫీడ్ ఇంటోలరెన్స్ (నెక్ట్రోటైజింగ్ ఎంటరోకాలైటిస్ స్టేజి -1 పీపీహెచ్ ఎన్ , నియోనాటల్ జాండిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను అధిగమించేలా చికిత్స అందించారు. ఇద్దరు వైద్యుల ప్రత్యేక కృషి, చికిత్స ఫలితంగా 14 రోజున తర్వాత బాబు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నాడు.
ఈ సందర్భంగా చిన్న పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శివకుమార్ మాట్లాడుతూ పూర్తి నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు ‘సర్ఫాక్టెంట్’ మరియు CPAP వంటి ఆధునిక వైద్య పరికరాల ద్వారా శ్వాస సమస్యలను సులభంగా అధిగమించవచ్చునని తమ హాస్పిటల్లో ప్రతి నెలా 1 నుంచి 1.5 కేజీల బరువున్న 3-4 ప్రీటమ్ డెలివరీ కేసులు సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు అనేక కేసులు చూడటం వల్ల వచ్చిన అనుభవం నేపథ్యంలో ప్రత్యేకంగా చూడాల్సిన కేసులను కూడా జాగ్రత్తగా చికిత్స అందిస్తూ తల్లిదండ్రుల మన్నన పొందడం సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక టాటా మెడికల్ కాలేజీలో అత్యంత అనుభవం కలిగిన ప్రొఫెసర్ల ఆధ్వర్యం లో చదివి అనేక క్యాంపులు మరియు వివిధ ఆసుపత్రులలో పనిచేసిన అనుభవం వల్ల అత్యంత తీవ్రమైన కేసులు కూడా తక్కువ ఖర్చులతో తమ ఆసుపత్రిలో వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్య సేవలు అతి తక్కువ ధరలో అందిస్తున్నామని వేములవాడ పరిసర ప్రాంతాలలోన గర్భిణులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రత్యేకమైన పద్ధతులలో గర్భిణులను చికిత్స చేయడం మరియు సాధారణ ప్రసవం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. తద్వారా పుట్టబోయే బిడ్డలకు మంచి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు. తీవ్రమైన సమస్యలు ఉన్నప్పటికీ కొన్ని ఆసుపత్రులు పేషంట్లను చేర్చుకోవడం లేదని సమస్య తీవ్రమైన తర్వాత మా హాస్పిటల్ లో చేరుతున్నప్పటికీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చికిత్స చేయడం ద్వారా అనేకమంది మహిళలు మరింత మందిని పంపిస్తున్నారని ఇది తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని తెలియజేశారు.
పద్మావతి హాస్పిటల్ నిర్వాహకులు రాజేష్ మాట్లాడుతూ.. అప్పుడే పుట్టిన పసికందులకు శ్వాస ఇబ్బందులు ఉన్నప్పుడు ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వేములవాడలోని పద్మావతి హాస్పిటల్లో అత్యాధునిక NICU సౌకర్యం మరియు అనుభవజ్ఞులైన వైద్య బృందం అందుబాటులో ఉన్నారని తెలిపారు. అలాగే, తమ హాస్పిటల్లో పుట్టిన పిల్లలకు ఆరు నెలల వరకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.

కృతజ్ఞతలు తెలిపిన తల్లిదండ్రులు: బాబు తండ్రి భరత్ మాట్లాడుతూ.. “మా మొదటి డెలివరీ సమయంలో కరీంనగర్లోని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో నెల రోజులు చికిత్స చేస్తే దాదాపు 4,80,000 రూపాయల ఖర్చు అయ్యింది. కానీ ఇక్కడ తక్కువ ఖర్చుతో, మా బాబును క్షేమంగా కాపాడి, మా దగ్గర డబ్బులు లేకున్నా చివరి 5 రోజులు ఉచితంగా ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లకు మరియు హాస్పిటల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు తక్కువ ఖర్చుతోనే కార్పొరేట్ వైద్యం అందిందని సంతోషం వ్యక్తం చేశారు. పేదలకు ఐసీయూ వైద్యం తక్కువ ఖర్చుతో అందడం వల్ల మా లాంటి ఎంతో మందికి ఉపయోగం ఉంటుందని పేర్కొన్నారు.