ఐపీఎల్‌లో SRH జట్టు మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచి Delhi Capitals పై భారీ విజయాన్ని సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించిన SRH మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చింది.
SRH బ్యాటింగ్ హైలైట్స్ : మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 242/2 అనే భారీ స్కోరు నమోదు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో Abhishek Sharma అద్భుత ప్రదర్శన కనబరిచి కేవలం 68 బంతుల్లో 135 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆయన ఇన్నింగ్స్‌లో భారీ సిక్సర్లు, ఫోర్లు ప్రేక్షకులను అలరించాయి.
DC బ్యాటింగ్: భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు ఒత్తిడికి లోనై నిర్ణీత ఓవర్లలో 195/9 వద్దే ఆగిపోయింది. Nitish Rana 57 పరుగులతో పోరాడగా, KL Rahul 37 పరుగులు చేసి కొంత మేర ప్రతిఘటన చూపించారు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు.
బౌలింగ్‌లో SRH ఆధిపత్యం: టీమ్ బౌలర్లు అద్భుతంగా రాణింలచారు. ముఖ్యంగా Eshan Malinga 4 వికెట్లు తీసుకుని మ్యాచ్‌ను SRH వైపు తిప్పగా, Harsh Dubey 3 వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. దీంతో 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో SRH జట్టు పాయింట్ల పట్టికలో తమ స్థాయిని మరింత బలపరుచుకోగా, అభిమానులు ఈ గెలుపును ఘనంగా జరుపుకుంటున్నారు.