జనగణమన దినపత్రిక

తెలంగాణ రక్షణ సేనలో కీలక నియామకాలు

- మెదక్ లోక్‌సభ ఇన్‌చార్జీతో పాటు 12 జిల్లాలకు అధ్యక్షులు.. అనుబంధ విభాగాలకు కొత్త బాధ్యతలు

2

జనగణమన బ్యూరో – హైదరాబాద్: రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత కీలక నియామకాలు చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం పార్టీకి సంబంధించిన పలు కొత్త నియామకాలను ప్రకటించారు. ఇందులో భాగంగా మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించడంతో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీల నియామకం పూర్తయింది. గత నియామకాల మాదిరిగానే తాజా నియామకాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు.

18 నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలు: ఆదిలాబాద్‌కు గోపు వేణుగోపాల్ యాదవ్, మహబూబ్‌నగర్‌కు దొడ్ల సౌజన్య రెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు చింతల రాజలింగం, కుత్బుల్లాపూర్‌కు ఎత్తరి మారయ్య, ఇబ్రహీంపట్నానికి మంచిరెడ్డి విజయ్ కిరణ్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్‌కు కందాడి మోహికా రెడ్డి, నిజామాబాద్ రూరల్‌కు బానోత్ నరేశ్ నాయక్, నిర్మల్‌కు డాక్టర్ మాల్వె చంద్ర ప్రకాశ్, ఖానాపూర్‌కు మేస్రం దయాకర్, అంబర్‌పేట్‌కు కంచగిరి ప్రవీణ్ కుమార్, ఖైరతాబాద్‌కు దేవరి చంద్రశేఖర్, జూబ్లీహిల్స్‌కు హలీమా బేగమ్, హుజూరాబాద్‌కు కోకట్ల సంతోష్ యాదవ్, పటాన్‌చెరుకు తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి, దేవరకొండకు నేనావత్ శివ నాయక్, నాంపల్లికి సయ్యద్ మతీన్ అహ్మద్, ఇల్లెందుకు వాసం రామకృష్ణ దొర, అశ్వారావుపేటకు సోడెం వెంకట్‌లను నియమించారు.

మెదక్ లోక్‌సభకు: మెదక్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జీగా మద్ది శ్రీనివాస్ రెడ్డిని నియమించారు.

12 జిల్లాలకు అధ్యక్షులు: రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పురం మహేందర్ రెడ్డి, సంగారెడ్డికి మాసన్నగారి బాలయ్య, ఆదిలాబాద్‌కు బాపురావు రాథోడ్, నిర్మల్‌కు లోకిని రాము, కొమ్రం భీం ఆసిఫాబాద్‌కు కిరిమిల వినోద్ చారి, మంచిర్యాలకు ఊదరి చంద్రమోహన్ గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరికి నవీన్ గోగికర్, మహబూబ్‌నగర్‌కు డాక్టర్ ఎర్రంశెట్టి వెంకట్రామ్ మూర్తి, నిజామాబాద్‌కు మంథెన నవీన్ రెడ్డి, కరీంనగర్‌కు గుంజపడుగు హరిప్రసాద్, భద్రాద్రి కొత్తగూడెంకు సముద్రాల క్రాంతి కుమార్, గ్రేటర్ హైదరాబాద్‌కు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌లను జిల్లా అధ్యక్షులుగా నియమించారు.

జిల్లా ప్రధాన కార్యదర్శులు: నిజామాబాద్‌కు దొంత ప్రవీణ్, మేడ్చల్–మల్కాజిగిరికి శీలం వీరేందర్, మంచిర్యాలకు తంగళ్లపల్లి అరుణ్ కుమార్‌లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

అనుబంధ విభాగాలకు కొత్త బాధ్యతలు: ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కుమ్మరి శివశంకర్, ప్రధాన కార్యదర్శిగా హకీంకారి సురేందర్ జీ; తెలంగాణ న్యాయ రక్షణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పాల నరేందర్ యాదవ్; టీఆర్ఎస్ ఎన్‌ఆర్‌ఐ వింగ్ గ్లోబల్ ప్రెసిడెంట్‌గా విజయ్ కూరబోయిన, గ్లోబల్ జనరల్ సెక్రటరీగా సుమన్ బల్మూరి నియమితులయ్యారు.

ట్రేడ్ అండ్ కామర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయ్ గరినె, ప్రధాన కార్యదర్శిగా రామ్ ప్రతాప్ శ్రీవాస్తవ్; సోషల్, డిజిటల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆకాశ్ కొల్లూరు, ప్రధాన కార్యదర్శిగా సందీప్ బెల్లంపల్లి, జాయింట్ సెక్రటరీలుగా కొలకాని మనోహర్, తేజా చౌదరి, కవిత మేరు, పాలె నిషాలను నియమించారు.

ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మహ్మద్ సుహైబ్, రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పొన్నమనేని బాలాజీ రావు, బంజారా విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్యాణ్ నాయక్, జర్నలిస్ట్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వంగ మహేందర్ రెడ్డి, తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (టీఆర్‌టీయూ) రాష్ట్ర అధ్యక్షుడిగా దేవల వీరన్నలను నియమించారు.

విద్యార్థి విభాగంలో స్టేట్ యూనివర్సిటీస్ ఇన్‌చార్జీగా డాక్టర్ సిమ్రాల చిన్నలింగమయ్య (అశోక్ యాదవ్), స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్‌చార్జీగా బండారు శ్రీనివాస్ గౌడ్, జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ విభాగాల ఇన్‌చార్జీగా వల్లకొండ అజయ్ రెడ్డిని నియమించారు.

Leave A Reply

Your email address will not be published.