జనగణమన దినపత్రిక

తెలంగాణకు కొత్త ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియామకం

- జీవో విడుదల చేసిన ప్రభుత్వం

1

హైదరాబాద్, జూన్ 26: తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు, IAS ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

సాధారణ పరిపాలన శాఖ విడుదల చేసిన జి.ఓ ప్రకారం, ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్న కే. రామకృష్ణరావు ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమించారు.

ఈ మేరకు తెలంగాణ గెజిట్ అసాధారణ సంచికలో నోటిఫికేషన్ ప్రచురించాలని ప్రభుత్వం ఆదేశించింది. గవర్నర్ ఆదేశాల మేరకు ఈ నియామక ఉత్తర్వులను ముఖ్య కార్యదర్శి ఎం. రఘునందన్ రావు జారీ చేశారు.

సంజయ్ జాజు జూలై 1, 2026 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.