ఎబోలా వ్యాప్తిపై WHO హెచ్చరిక

సెంట్రల్ డెస్క్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎబోలా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రస్తుతం కాంగో మరియు ఉగాండా దేశాల్లో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 300కు పైగా కేసులు నమోదైనట్లు WHO వెల్లడించింది.

ఎబోలా ఒక తీవ్రమైన వైరల్ వ్యాధి. ఇది సోకిన వ్యక్తుల శరీర ద్రవాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. జ్వరం, వాంతులు, విరేచనాలు, అంతర్గత మరియు బాహ్య రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి నియంత్రణ కోసం బాధిత ప్రాంతాల్లో వైద్య బృందాలు, పరీక్షలు, క్వారంటైన్ చర్యలను WHO ముమ్మరం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.

Leave A Reply

Your email address will not be published.