నేడే ఈఏపీసెట్‌-2026 ఫలితాల విడుదల

హైదరాబాద్:  తెలంగాణ ఈఏపీసెట్‌-2026 ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు జేఎన్‌టీయూహెచ్‌ గోల్డెన్‌ జూబ్లీ హాల్‌లో ఫలితాలను ఉన్నత విద్యామండలి అధికారులు విడుదల చేయనున్నారు. అనంతరం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈసారి ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలను జేఎన్‌టీయూ హైదరాబాద్‌ నిర్వహించింది. అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్షలు మే 4, 5 తేదీల్లో, ఇంజినీరింగ్‌ పరీక్షలు మే 9 నుంచి 11 వరకు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను చూసేందుకు అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌, జనన తేదీ వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఫలితాల విడుదల తర్వాత అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఫలితాల విడుదల కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, టీజీసీహెచ్‌ఈ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి. బాలకిష్టారెడ్డి తదితరులు పాల్గొననున్నారు.

Leave A Reply

Your email address will not be published.