శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసిన టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం నాయకులు
అమెరికా పర్యటన అనంతరం స్పీకర్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఇమ్మడోజు వెంకట శివరామకృష్ణారావు, కాసర్ల లింగారెడ్డి
జనగణమన బ్యూరో – హైదరాబాద్: తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం నాయకులు బుధవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికా పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన సందర్భంగా స్పీకర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మడోజు వెంకట శివరామకృష్ణారావు, సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు కాసర్ల లింగారెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో ఫోరం నాయకులు ఆత్మీయంగా ముచ్చటించారు. పరస్పర యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటూ స్నేహపూర్వక వాతావరణంలో సమావేశమయ్యారు. ఉపాధ్యాయులు, అధ్యాపకుల ప్రతినిధులుగా ఫోరం నాయకులు స్పీకర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మర్యాదపూర్వక భేటీలో ఇమ్మడోజు వెంకట శివరామకృష్ణారావు, కాసర్ల లింగారెడ్డి పాల్గొని స్పీకర్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.